ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వృద్ధుడిని ఆదరించి.. మానవత్వం ఉందని నిరూపించి.. - యర్రగుంట్లలో అనాథను ఆదుకున్న వివేకానంద ఫౌండేషన్ రూపకర్త

Papigenni Ramakrishna reddy: ప్రస్తుత సమాజంలో సొంతవారినే చాలామంది రోడ్డుపైకి విసిరేస్తున్నారు.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూస్తేనే అసహించుకుంటున్నారు... ఒట్టిపోయిన వారి శరీరాలను చూసి చీదరించుకుంటున్నారు... దుర్వాసన వస్తోందని ముక్కు మూసుకుంటున్నారు. కానీ ఆయన అవేమీ చూడలేదు... ఆయనకేమీ కాని ఓ వ్యక్తిని ఆదరించారు... రోడ్డుపై అనాథగా తిరుగుతున్న వృద్ధుడికి స్నానం చేయించారు... కొత్తబట్టలు వేశారు... ఫలహారం పెట్టించారు. నడవడానికి సాయంగా కర్రనందించారు... ఆయనే వివేకానంద ఫౌండేషన్ రూపకర్త..!

Papigenni Ramakrishna reddy
వివేకానంద ఫౌండేషన్ రూపకర్త పాపిజెన్ని రామకృష్ణారెడ్డి

By

Published : Mar 12, 2022, 3:05 PM IST

Papigenni Ramakrishna reddy: "ఎవరూ లేనివారికి ఆ దేవుడే దిక్కు" అని చాలా మంది అంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ.. అనాథలకు నేనున్నాను అంటున్నారు వివేకానంద ఫౌండేషన్ రూపకర్త పాపిజెన్ని రామకృష్ణారెడ్డి. గత కొంత కాలంగా అనాథలకు అండగా నిలుస్తున్న ఆయన మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

వివేకానంద ఫౌండేషన్ రూపకర్త పాపిజెన్ని రామకృష్ణారెడ్డి

కడప జిల్లా యర్రగుంట్ల ప్రధాన రహదారిపై ఎన్నో ఏ‌ళ్లుగా అనాథగా తిరుగుతున్న ఓ వృద్ధుడిని చూసిన రామకృష్ణారెడ్డి అతడిని ఆదుకున్నారు. అపరిశుభ్రంగా ఉన్న వృద్ధుడిని ఓ చోటుకు తీసుకొచ్చి క్షవరం చేయించారు. అతడికి స్నానం చేయించారు. అనంతరం కొత్త వస్త్రాలను వేశాడు. కడుపునిండా ఫలహారం తినిపించారు. అంతేనా ఆ వృద్ధుడు నడవడానికి సాయంగా ఓ కర్రను సైతం అందించాడు... రామకృష్ణారెడ్డి. ఆయన సేవలను చూసి స్థానికులు గొప్పగా చెప్పుకొంటున్నారు.

ఇదీ చదవండి:Fire In Forest: అడవిలో అంటుకున్న మంటలు... ఆందోళనలో ప్రజలు..

ABOUT THE AUTHOR

...view details