ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర రహదారులపై టోల్​ఫీజుల వసూళ్లు దారుణం' - రాష్ట్ర రోడ్లపై టోల్ వసూళ్లను కడపలో నిరసించిన సీపీఎం నేత నారాయణ

జాతీయ రహదారులతో పాటు రాష్ట్రంలోని సాధారణ రోడ్లపైనా టోల్ వసూలు చేయడాన్ని.. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ ఖండించారు. ఆ వసూళ్లను ఆపకుంటే.. పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

cpm protests in kadapa
నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నేతలు

By

Published : Nov 21, 2020, 3:48 PM IST

రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు రద్దు చేయాలని.. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ డిమాండ్ చేశారు. కడప పాత బస్టాండ్​లోని పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జాతీయ రహదారులతో పాటు సాధారణ రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు వసూలు చేయడం దారుణమని నారాయణ పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అన్ని రూపాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. తక్షణం ఆ రుసుముల వసూలును రద్దు చేయకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'ధర్నాలు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details