ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2020, 6:31 PM IST

Updated : Nov 16, 2020, 9:27 AM IST

ETV Bharat / city

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గృహ ప్రవేశాల కార్యక్రమం: సీపీఐ రామకృష్ణ

ఇవాళ నుంచి గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీపీఐ రామకృష్ణ తెలిపారు. 18 నెలల క్రితమే పూర్తయిన నివాసాలను పేదలకు ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

cpi ramakrishna
సీపీఐ రామకృష్ణ

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి సంక్రాంతి పండుగ వరకు సీపీఐ ఆధ్వర్యంలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. కడప శివారులో నిర్మించిన టిడ్కో నివాసాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రామకృష్ణ మాట్లాడుతూ.. 18 నెలల క్రితమే పూర్తయిన నివాసాలను పేదలకు ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఇళ్లు నాణ్యంగా నిర్మించారని స్వయంగా ముఖ్యమంత్రి కితాబిచ్చారని గుర్తుచేశారు. అయితే చాలా గృహాలకు కనీస మౌలిక వసతులు కల్పించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం రోడ్లు, విద్యుత్, మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

సీపీఐ గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని చేపట్టడంతో సీఎం ఆగమేఘాల మీద లబ్ధిదారులకు నివాసాలను కేటాయించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇవాళ జరిగే ప్రవేశాలను పోలీసులు అడ్డుకోవద్దని ఎవరి నివాసాలను వారికే కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు..అభినందించిన డీజీపీ

Last Updated : Nov 16, 2020, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details