ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Protest: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు

CPI Protests: విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేసింది. కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

CPI Protests
విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు

By

Published : Mar 31, 2022, 11:43 AM IST

Updated : Mar 31, 2022, 1:02 PM IST

CPI Protest : విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేసింది. పన్నులు, ఛార్జీల పెంపుతో ప్రజలపై సీఎం జగన్‌ వరుస భారాలు మోపుతున్నారని కడపలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కరెంటు ఛార్జీలతోపాటు నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్​ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు

ఆగస్టు 1 నుంచి ట్రూఅప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమైందని రామకృష్ణ తెలియజేశారు. అదానీ, అంబానీ కంపెనీలకు దోచిపెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రో, గ్యాస్, నిత్యావసర ధరలను పెంచిందని.. అది చాలదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రో ధరలు ఉన్నాయన్నారు. ప్రభుత్వాల నిర్వాకం వల్ల మరో 25 ఏళ్ల పాటు ప్రజలు ఇలాంటి భారాలు మోయాల్సిందేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పార్టీ సిద్ధమవుతోందని రామకృష్ణ తెలియజేశారు.

కర్నూలు, విజయనగరం, విశాఖ, ఏలూరులో: కర్నూలులోని విద్యుత్ భవన్‌ ఎదుట వామపక్షాలు నిరసన చేపట్టాయి. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాల ఆందోళన చేశాయి. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. విశాఖలో ఏపీఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద సీపీఎం, అనుబంధ సంఘాలు నిరసన చేపట్టాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశాయి. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వామపక్షాల డిమాండ్‌ చేశాయి. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించేవరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి.

ఒంగోలు, తిరుపతి, కృష్ణా: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ వద్ద వామపక్షాలు నిరసన చేపట్టాయి. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయం ఎదుట వామపక్షాలు నిరసన చేపట్టాయి. సామాన్యులపై భారం మోపేలా విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ఆందోళన నిర్వహించాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచటంతో కృష్ణాజిల్లా నందిగామలో వామపక్షాలు ఆందోళన చేశాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.

విజయవాడ: పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సీపీఎం ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మాట తప్పారని సీపీఎం నేత బాబు రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను, చెత్తపై పన్ను ఇతర టాక్స్​లను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

గుంటూరు:విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో నులకపేట విద్యుత్ సబ్​స్టేషన్ ముందు వామపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నినదించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్​లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన ఉద్యమం కారణంగా అప్పటి ప్రభుత్వం పడిపోయిందని గుర్తు చేశారు. అదే గతి జగన్ కు పట్టబోతుందని హెచ్చరించారు

ఇదీ చదవండి:AP Revenue Divisions: రాష్ట్రంలో కొత్తగా 24 రెవెన్యూ డివిజన్లు..

Last Updated : Mar 31, 2022, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details