కడప జిల్లాలో కరోనా కలవరం - kadapa district corona positive cases news in telugu
కడప జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 51కి చేరింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదైనందున జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 51కి చేరింది. 28 యాక్టివ్ కేసులు కాగా... 23 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఒక్క ప్రొద్దుటూరు పట్టణంలోనే 20కి పైగా కేసులు నమోదవటం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వేంపల్లె, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల, కమలాపురం ప్రాంతాల్లో కేసులు అధికమవ్వటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి:జిల్లాలో కఠినంగా ఆంక్షల అమలు
TAGGED:
కడపలో కరోనా పాజిటివ్ కేసులు