కడప జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కడప బీకేఎం వీధి, చెన్నూరు, మైదుకూరు, పుల్లంపేట ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 69కి చేరింది. 41 కేసులు యాక్టివ్ లో ఉండగా... 28 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో ప్రొద్దుటూరులో అత్యధికంగా 29 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎర్రగుంట్లలో 11, కడపలో 10, పులివెందుల, మైదుకూరు, బద్వేలు ప్రాంతాల్లో నాలుగు కేసుల చొప్పన నమోదు అయ్యాయి.
కడప జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు - కడప జిల్లాలో కరోనా కేసులు
కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇంకా 13 వందల మంది అనుమానితుల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 69 కేసులు నమోదయ్యాయి.
corona cases in kadapa district
చెన్నూరు, వేంపల్లెలో రెండు కేసులు చొప్పున నమోదు కాగా... కమలాపురం, పుల్లంపేట, సీకే దిన్నె ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. జిల్లాలో ఇంకా 13 వందలకు పైగానే శ్యాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. కొత్త కేసులు వచ్చిన ప్రాంతాలపై అధికారులు మరింత దృష్టి సారించారు.
ఇవీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు