ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకగాంధీ అరెస్టును కడప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. దీనిని వ్యతిరేకిస్తూ కడప అంబేడ్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులకు నల్లజెండాలతో నిరసన తెలియజేశారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకగాంధీని భాజపా ప్రభుత్వం అరెస్టు చేయడం తగదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. ఇలా అడ్డగించడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అన్నారు. దీనికి భాజపా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.
సంబంధిత కథనాలు