ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP CONGRESS: 'స్వార్థ ప్రయోజనాల కోసమే ఇంధన ధరల పెంపు'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడానికే వంట గ్యాస్​, ఇంధన ధరలను పెంచుతున్నారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. దీనికి నిరసనగా కడప నగరంలో సైకిల్​ ర్యాలీని నిర్వహించారు.

CYCLE RALLY
స్వార్థ ప్రయోజనాల కోసమే ఇంధన ధరల పెంపు

By

Published : Jul 16, 2021, 7:48 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్రో, డీజిల్, వంటగ్యాస్ ధరలను భారీగా పెంచాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలను వెనకేసుకోవడానికే ప్రధాని పెట్రో ధరలు పెంచుతున్నారని కాంగ్రెస్​ నేతలు శైలజానాథ్ (SAILAJANATH), తులసిరెడ్డి (TULASI REDDY) ఆరోపించారు. పెట్రో ధరలకు నిరసగా.. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నగరంలోని కోటిరెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ (CYCLE RALLY) నిర్వహించారు.

మోదీ, జగన్​లు సామాన్య ప్రజలపై భారం మోపడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. ప్రజలు రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే కాలం దగ్గర్లోనే ఉందని శైలజానాథ్ అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి (CM JAGAN) చేస్తున్న చెత్త పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే సెంచరీ దాటగా.. వంటగ్యాస్ ధర పది సెంచరీలు దాటిందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదేనా నరేంద్రమోదీ (PM MODI) తెచ్చిన అచ్చేదిన్ పాలన అంటే అంటూ మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు ప్రజల కష్టాన్ని దోచిపెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్న తులసిరెడ్డి.. రాష్ట్రంలో పెట్రో పన్నులపై వాటాను తగ్గించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని వైకాపా ప్రభుత్వానికి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details