రాష్ట్రంలో 'అప్పులు ఫుల్.. అభివృద్ధి నిల్' అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కడప జిల్లా వేంపల్లిలో ధ్వజమెత్తారు. సంక్షోభంలో సంక్షేమం అన్నట్లుగా ఈ రెండు సంవత్సరాల పరిపాలన సాగిందని దుయ్యబట్టారు. రెండేళ్లలో జగన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా రూ. 1,29,615 కోట్లు అప్పు చేసిందని వెల్లడించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా పరోక్షంగా దాదాపు రూ. లక్ష కోట్లు అప్పు చేసిందని.. వీటికితోడు మరో లక్ష కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
దివాళా తీసే స్థాయిలో రాష్ట్ర అప్పులు..
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 25 శాతానికి మించకూడదని, కానీ మన రాష్ట్రంలో 36.46 శాతం ఉన్నట్లు తెలిపారు. ఇది దేశంలోనే అత్యధికమన్నారు. వైకాపా పాలనలో అప్పుల కుప్పలా తయారైన రాష్ట్రం.. త్వరలోనే దివాలా తీసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు.
నవరత్నాలన్నీ నకిలీలే..