ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Thulasi Reddy: రాష్ట్రంలో 'రౌడీరాజ్యం' రాజ్యమేలుతోంది: తులసి రెడ్డి - సీఎం జగన్​పై తులసిరెడ్డి కామెంట్స్

Congress Leader Thulasi Reddy on Chandraiah Murder: రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో తెదేపా నాయకుడు చంద్రయ్య హత్య రాష్ట్రంలో ఆటవిక పాలనను తలపిస్తోందని వ్యాఖ్యానించారు.

Thulasi Reddy
Thulasi Reddy

By

Published : Jan 14, 2022, 4:32 PM IST

Thulasi Reddy on Chandraiah Murder: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లాలో తెదేపా నాయకుడు చంద్రయ్య హత్య ఘటన అమానుషమని కడపలో వ్యాఖ్యానించారు.

పట్టపగలు వైకాపా నాయకులు కత్తులు, బండరాళ్లతో చంద్రయ్యను కొట్టిచంపడం ఆటవిక పాలనను తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం రాజ్యమేలుతోందన్న తులసిరెడ్డి... శాంతిభద్రతలు గాడితప్పాయని విమర్శించారు. కనీసం శాంతిభద్రతలనైనా పరిరక్షించాలని జగన్​ను కోరారు.

ఇదీ చదవండి.. :YSRCP Clases: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ‌ర్గీయుల మ‌ధ్య ఘర్షణ.. పోలీసులకు ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details