"ఈ నెలాఖరు నాటికి కారుణ్య నియామక ప్రక్రియ పూర్తి" - merge
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఇటీవలే సంస్థ పచ్చజెండా ఊపిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి దామోదర్ రావు తెలిపారు.

ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి దామోదర్ రావు అన్నారు. ఆర్టీసీ దంపతులకు ఉచిత ప్రయాణం కల్పించే విషయంలో యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కడప ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ప్రాంతీయ మహాసభ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విలీనానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని, ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు వేసినప్పటికీ ఆర్టీసీ విలీనం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరి క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని తెలిపారు. విలీన విషయంలో ఏమైన లోటుపాట్లు జరిగితే పోరాటం చేసేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సిద్ధంగా ఉందన్నారు.