ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KOPPARTHI HUB: కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్​కు కంపెనీలు - dixon company

కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో(KOPPARTHI HUB) పరిశ్రమలు పెట్టడానికి ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే డిక్సన్ వంటి దిగ్గజ కంపెనీ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి ముందుకు రాగా.. మరో 2 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టుల ద్వారా 4 వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.

KOPPARTHI HUB
కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్​కు కంపెనీలు

By

Published : Jul 3, 2021, 8:35 AM IST

కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్​కు కంపెనీల క్యూ..

కడప జిల్లా సీకే దిన్నె మండలం కొప్పర్తిలోని ఏపీఐఐసీ(APIIC)కి చెందిన 7 వేల ఎకరాల ప్రాంతానికి జగనన్న మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌గా నామకరణం చేశారు. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు రావడంతో.. ప్రస్తుతం 2వేల ఎకరాలను సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రముఖ డిక్సన్‌ కంపెనీ ఎలక్ట్రానిక్స్ పరికరాలు, మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలు వంటివి తయారు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా.. ఆ కంపెనీకి సంబంధించిన షెడ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నీల్‌ కమల్‌ కంపెనీ 486 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా.. 105 ఎకరాల భూమిని ఏపీఐఐసీ(APIIC) కేటాయించింది. పిట్టీ ఇంజనీరింగ్‌ కంపెనీ రూ.400 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవగా.. ఎకరా 10 లక్షల చొప్పున 117 ఎకరాల భూమిని ప్రభుత్వం ఈ కంపెనీకి కేటాయించింది. అన్ని సక్రమంగా జరిగితే దసరా రోజున సీఎం జగన్‌ వీటికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ ప్రభుత్వ సలహాదారు రాజోలి వీరారెడ్డి అన్నారు.

"గతంలో కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చే కంపెనీలకు ఎకరా 25 లక్షల చొప్పన కేటాయించగా.. మరిన్ని కంపెనీలను ఆకర్షించేలా ఎకరా 10 లక్షలకే కేటాయించినట్లు APIIC ప్రకటించింది. బడా కంపెనీలే కాకుండా MSME ల కింద సుమారు 240 కోట్ల రూపాయలతో మరో 70 ఎకరాల్లో 37 చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి."- జయలక్ష్మీ, జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ

కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో(KOPPARTHI HUB) పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నందున.. ఇక్కడ మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రహదారులు, విద్యుత్‌, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:

AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా

ABOUT THE AUTHOR

...view details