ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గత రెండు రోజులుగా కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం... పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
పులివెందుల సీఎస్ఐ చర్చిలో సీఎం జగన్ ప్రార్థనలు - కడపలో సీఎం జగన్ పర్యటన
పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ముఖ్యమంత్రి జగన్... కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
cm visit pulivendula church