ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Kadapa tour: సొంత జిల్లాకు సీఎం జగన్.. 3 రోజులపాటు పర్యటన - ఏపీ సీఎం వార్తలు

CM Jagan Kadapa tour: ఈనెల 23 నుంచి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 25వ తేదీన పులివెందులలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.

CM Jagan Kadapa tour
CM Jagan Kadapa tour

By

Published : Dec 21, 2021, 4:03 PM IST


CM Jagan Kadapa tour: ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23, 24, 25 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. 23న ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తి ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.అనంతరం ప్రొద్దుటూరు తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. 24వ తేదీన ఇడుపులపాయ, పులివెందులకు ముఖ్యమంత్రి జగన్ బయల్దేరనున్నారు. ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. పులివెందులలో జగనన్న హౌసింగ్ కాలనీ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. 25వ తేదీన పులివెందులలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.

రేపు కర్నూలు జిల్లాలో..

CM Jagan Kurnool Tour: రేపు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు... శివ నరసింహారెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కర్నూలు నగరానికి సమీపంలోని పంచలింగాల మాంటిస్సోరి పాఠశాలలో వివాహం జరగనుంది. ఉదయం 11:15 గంటలకు కర్నూలు విమానాశ్రయం ముఖ్యమంత్రి చేరుకుంటారు. వివాహం అనంతరం మధ్యాహ్నం 12:40 గంటలకు తాడేపల్లికి బయల్దేరుతారు.

ఇవాళ తణుకులో సీఎం పర్యటన..

CM Jagan Launched Jagananna Sampoorna Gruha Hakku Scheme at Tanuku: ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించిన సీఎం జగన్.... 'జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని' ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న జగన్​.. ప్రజలకు సంపూర్ణ గృహహక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఉచితంగా రిజిస్టర్‌ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇంటి నిర్మాణానికి ప్రతి నిరుపేద జీవితకాలం కృషి చేస్తారు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలం ఇల్లు. ఇంటిపై పూర్తిస్థాయి యజమానులుగా మారేందుకు కృషి చేస్తున్నాం. కేవలం రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చు. ఉచితంగా రిజిస్టర్‌ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం. ఇంటిని అమ్ముకునే హక్కును కల్పిస్తున్నాం. ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. -జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details