ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ.3 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు.. సీఎం శంకుస్థాపన - 3వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు వార్తలు

కడప జిల్లా .. రాయచోటిలో 3 వేల కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు.

cm-jagan-rayachoti-tour
cm-jagan-rayachoti-tour

By

Published : Dec 24, 2019, 2:58 PM IST

3వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు - సీఎం శంకుస్థాపన

సీఎం జగన్ కడప జిల్లా రాయచోటిలో....పలు అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టారు. రూ. 3వేల కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి.. 2వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే పథకానికి శంకుస్థాపన చేశారు.ఈ ఎత్తిపోతల పథకం ద్వారా..కాలేటి వాగును నింపి..అక్కడ నుంచి చక్రాయపేట,రామాపురం,లక్కిరెడ్డిపల్లె మండలాలకు నీరు అందిస్తారు.హంద్రినీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ అనుసంధానానికి2వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నారు.వెలిగల్లు జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి...గాలివీడు,రాయచోటి మండలాల్లోని చెరువులను నింపే పథకానికీ సీఎం శంకుస్థాపన చేశారు.

ABOUT THE AUTHOR

...view details