గ్రామంలో సమస్యలు పరిష్కరించట్లేదంటూ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండల చిన్నరాజుపల్లి గ్రామస్తులు ఉపఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బద్వేలు ఉపఎన్నికల్లో ఓటు వేసేది లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రధానంగా గ్రామానికి సమీపంలో చెరువు ఉండటంతో చెరువు నిండినప్పుడల్లా రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని వివరించారు. గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వల్ల యువతీయువకులకు పెళ్లి కావాలన్నా కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఎవర్ని రానివ్వబోమని చెబుతున్నారు.
BY-POLL : బద్వేలు ఉపఎన్నికను బహిష్కరించిన గ్రామస్థులు - villagers boycott Badvelu by-election
బద్వేలు ఉపఎన్నికను బహిష్కరించాలని కడప జిల్లా చిన్నరాజుపల్లి గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామంలో సమస్యలను పాలకులు పరిష్కరించలేదని ఆగ్రహంవ్యక్తం చేస్తూ... ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
![BY-POLL : బద్వేలు ఉపఎన్నికను బహిష్కరించిన గ్రామస్థులు బద్వేలు ఉపఎన్నికను బహిష్కరించిన గ్రామస్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13248550-1096-13248550-1633261945434.jpg)
బద్వేలు ఉపఎన్నికను బహిష్కరించిన గ్రామస్థులు