Cheating case on SI: కడప సైబర్ క్రైమ్ ఎస్సైగా పనిచేస్తున్న జీవన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కడప తాలూకా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కానీ ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. బాధితులు మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది. కడపలోని నకాష్ వీధికి చెందిన అల్తాఫ్ హుస్సేన్ అనే వ్యక్తి.. భార్యతో కలిసి 'లూ లూ' పేరిట ట్రేడింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డబ్బులు పెట్టుబడిగా పెడితే రెట్టింపు ఇస్తామని, నెలకు తగిన వడ్డీ ఇస్తామంటూ కొందరితో రూ.లక్ష మేరకు పెట్టుబడులు పెట్టించుకున్నారు. కడపకు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఎస్ఐ జీవన్‌రెడ్డి కూడా తన వంతుగా రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు.
కడప సైబర్ క్రైమ్ ఎస్ఐపై చీటింగ్ కేసు.. ఎందుకంటే..? - కడప జిల్లాలో ఎస్ఐతోపాటు మరో ఉద్దరిపై చీటింగ్ కేసు
Cheating case on SI: పెట్టుబడి పెట్టండి.. రెట్టింపు ఇస్తాం.. అంతేకాదు నెలనెలా వడ్డీ కూడా ఇస్తామని ఓ ట్రేడింగ్ సంస్థ ఎన్నో కబుర్లు చెప్పింది. దీంతో పలువురు సంస్థలో పెట్టుబడి పెట్టారు. కానీ కొన్ని రోజుల నుంచి సంస్థకు నష్టాలు రావడంతో డబ్బులివ్వడం మానేశారు. బాధితులంతా తమ డబ్బులు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులకు ఫోన్లు చేశారు. అయితే ఇక్కడే అసలు విషయం జరిగింది. నిర్వాహకుల తరుపున ఓ ఎస్ఐ రంగంలోకి దిగాడు. డబ్బులు ఇచ్చేది లేదని బాధితులకు తేల్చి చెప్పాడు. దీంతో బాధితులు స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేయగా... సదరు ఎస్ఐపై చర్యలు చేపట్టారు.
కానీ కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్ సంస్థకు నష్టాలు రావడంతో మూసేశారు. బాధితులకు సంస్థ నిర్వాహకులు డబ్బులు చెల్లించడం లేదు. ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఇమ్రాన్.. సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని అడిగాడు. ఇంతలో ఎస్ఐ జీవన్‌రెడ్డి నిర్వాహకుల తరఫున జోక్యం చేసుకుని.. డబ్బులు ఇచ్చేది లేదంటూ అతడితో తెల్చి చెప్పారు. బాధితులు స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. ఎస్పీ కేసు నమోదు చేయాలని తాలూకా పోలీసులను ఆదేశించారు. పోలీసులు.. అల్తాఫ్ హుస్సేన్‌తో పాటు అతని భార్య, ఎస్సై జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. కానీ ఎస్ఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితుడు ఇమ్రాన్ తెలిపారు.
ఇవీ చదవండి: