సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ లోపం వల్లే వరద నీటిని తట్టుకోలేక కట్టలు తెగిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రాజంపేట మండలం మందపల్లిలో వరద బాధితులను పరామర్శించారు. పింఛా ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో.. వరద నీరు అన్నమయ్య ప్రాజెక్ట్‌కు పోటెత్తి కట్ట తెగిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందపల్లిలో ఒకే కుటుంబంలో 9మంది మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని మండిపడ్డారు. పులపుత్తూరు, గుండ్లూరులోనూ చంద్రబాబు పర్యటించారు.
రేపు చిత్తూరు జిల్లాలో పర్యటన