ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విచారణ కోసం.. వివేక మాజీ డ్రైవర్​ను దిల్లీ తీసుకెళ్లిన సీబీఐ

viveka murder case investigation
viveka murder case investigation

By

Published : Apr 16, 2021, 12:47 PM IST

Updated : Apr 16, 2021, 2:25 PM IST

12:43 April 16

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తుంది. మూడ్రోజుల కిందట దస్తగిరిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. అతడిని దిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు. అటు.. పులివెందులలో దస్తగిరి తల్లిదండ్రులు హాజీవలి, మస్తానమ్మను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. హాజీవలిని సీబీఐ అధికారులు అనంతపురం జిల్లా కదిరికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఓ దుకాణం నిర్వహిస్తున్నందున పరిశీలించేందుకు వెళ్లినట్లు తెలిసింది. కూలి పని చేసుకుని జీవనం సాగించే తమ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధిస్తున్నారని దస్తగిరి తల్లి కంటతడిపెట్టింది.

ఇదీ చదవండి: వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

Last Updated : Apr 16, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details