మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేటి నుంచీ విచారణ మళ్లీ ప్రారంభంకానుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి ఆదివారం సాయంత్రం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసులో గతంలో సీబీఐ అధికారులు విచారణ జరిపారు. పులివెందులలోని కడపలో పలువురిని ప్రశ్నించారు.
గతేడాది కొంతమంది అధికారులకు కరోనా సోకటంతో...ఉన్నఫలంగా విచారణ నిలిపేశారు. 7 నెలల అనంతరం విచారణ జరిపేందుకు వచ్చిన అధికారులు.. ఇదివరకే ప్రశ్నించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి కేసులోని కీలక వ్యక్తులను సీబీఐ ప్రశ్నించే అవకాశముంది.