మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో 94వ రోజు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నేడు పులివెందులకు చెందిన వివేకా సోదరుడు వైఎస్ సుధీకర్ రెడ్డి తొలిసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. సీబీఐ అధికారుల పిలుపు మేరకు సుధీకర్ రెడ్డి నేరుగా హైదరాబాద్ నుంచి కడపకు వచ్చారు.
VIVEKA MURDER CASE: విచారణకు హాజరైన వివేకా సోదరుడు - YS Viveka murder case latest information
వైఎస్ వివేకా హత్యకేసులో 94వ రోజు సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. నేడు వివేకా సోదరుడు సుధీకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
వైఎస్ వివేకా హత్యకేసు
వివేకా హత్యకేసుకు సంబంధించి ఆయన నుంచి వివరాలు తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు పిలిచినట్లు తెలుస్తోంది. ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో సుధీకర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. స్పష్టమైన ఆధారాల సేకరణ కోసం సీబీఐ అధికారులు.. వివేకా కుటుంబ సభ్యులను వరసగా విచారణకు పిలుస్తున్నారు.
ఇదీ చదవండీ.. CHANDRABABU: డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ
Last Updated : Sep 8, 2021, 3:29 PM IST