మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 16వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వైకాపా కార్యకర్త చిన్నపరెడ్డిని సీబీఐ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. సీబీఐ అధికారులు గత కొద్ది రోజులుగా అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని ఢిల్లీకి తీసుకెళ్లి విచారించారు. సీబీఐ అధికారులు ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు.
viveka murder case: వివేకా హత్య కేసు.. 16వరోజు కొనసాగుతోన్న విచారణ - మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 16వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో జరుగుతోన్న విచారణకు వైకాపా కార్యకర్త చిన్నపరెడ్డి హాజరయ్యారు.
cbi investigating viveka murder case