ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YS Viveka Murder Case: వివేకా కేసులో శివశంకర్‌రెడ్డి కస్టడీకి సీబీఐ పిటిషన్ - Viveka Murder latest news

వివేకా కేసు(YS Viveka Murder Case)లో నిందితుడిగా ఉన్న శివశంకర్​ రెడ్డిని కస్టడీకి కోరింది సీబీఐ. ఈ మేరకు పులివెందుల కోర్టులో పిటిషన్ వేసింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డి
YS Viveka Murder Case

By

Published : Nov 22, 2021, 7:09 PM IST

Updated : Nov 22, 2021, 10:25 PM IST

వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డిని సీబీఐ కస్టడీకి (YS Viveka Murder Case) కోరింది. ఈ మేరకు 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు శివశంకర్ రెడ్డి(Shivshankar Reddy Accused in Viveka Murder Case) తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న సీబీఐ.. ఈ నెల 17న హైదరాబాద్​లో అతడిని అరెస్టు చేసింది. మరోవైపు దస్తగిరి అప్రూవర్ పిటిషన్‌పై కడప సబ్ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

హైదరాబాద్​లో అరెస్ట్..

వివేకా హత్య కేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(Shiva Shankar Reddy arrest) ని నవంబరు 17వ తేదీన హైదరాబాద్‌లో అదుపులోకి(CBI Arrests Shiv Shankar Reddy in YS Viveka Case) తీసుకుంది. ఆయన కడప ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి(Kadapa MP Avinash Reddy)కి సన్నిహితుడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి(Dhastagiri) ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఉంది. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ ఇటీవల సమాచారమిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తర్వాత వస్తానంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్‌లో ఆయన్ను పట్టుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం ఆయన్ను కడప తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టింది. అనంతరం ఆయన్ను పులివెందులకు తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

High court on three capitals cases: 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి: హైకోర్టు

Last Updated : Nov 22, 2021, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details