Car catches fire: కడప జిల్లా బద్వేలులోని శివరామకృష్ణ నగర్లో ఓ కారులో మంటలు చెలరేగాయి. కారు పార్కింగ్ చేసిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వర్షం కురుస్తున్నా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి.. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ప్రమాదానికి గురైన కారు బద్వేల్ గాండ్ల వీధికి చెందిన తేజస్‌కు చెందినదిగా గుర్తించారు. వారి వీధిలో సీసీ రోడ్లు వేస్తున్నందున శివరామకృష్ణ నగర్లో కారును పార్కింగ్ చేసినట్లు తేజస్.. అగ్నిమాపక అధికారులకు తెలిపారు.
Fire in Car: కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం - Car catches fire
A car caught fire: కారులో మంటలు చెలరేగి ప్రాణాలు పోయిన ఘటనలు రోజు చూస్తునే ఉన్నాం. ఇలాంటి ఘటనే కడప జిల్లా బద్వేలు పురపాలికలోని శివరామకృష్ణ నగర్లో జరిగింది. అయితే అదృష్టం కొద్దీ కారును పార్కింగ్ చేసినప్పుడు ఈ ఘటన జరగడం.. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కారులో అగ్ని ప్రమాదం
Last Updated : Sep 28, 2022, 6:07 PM IST