కడప ఎస్పీ అన్బురాజన్ అసభ్య పదజాలంతో దూషించారని... బీజేవైఎం జాతీయ కార్యదర్శి సురేష్ ఆరోపించారు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని కడప అంబేద్కర్ కూడలి వద్ద నోటికి నల్లగుడ్డ కట్టుకొని దీక్ష చేపట్టారు. డిసెంబర్ 1న కడప జిల్లా చిట్వేలు మండలానికి చెందిన ప్రసాద్ రాజు కుటుంబం... భాజపాలో చేరడం జీర్ణించుకోలేక వైకాపా నాయకులు ఆయన కుటుంబంపై దాడిచేసి గాయపరిచారు.
ఎస్పీ తీరుకు నిరసనగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి దీక్ష - కడపలో ఎస్పీ తీరుకు వ్యతిరేకంగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి దీక్ష
పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని కడప అంబేద్కర్ కూడలి వద్ద... నోటికి నల్లగుడ్డ కట్టుకొని బీజేవైఎం జాతీయ కార్యదర్శి సురేష్ దీక్ష చేపట్టారు. కడప ఎస్పీ అసభ్య పదజాలంతో దూషించారని, తక్షణమే అన్బురాజన్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![ఎస్పీ తీరుకు నిరసనగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి దీక్ష BJYM Leader Protest on sp behavior in cadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5266970-419-5266970-1575458560978.jpg)
ఎస్పీ తీరుకు వ్యతిరేకంగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి దీక్ష
ఎస్పీ తీరుకు నిరసనగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి దీక్ష
ఈ విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు 2న స్పందన కార్యక్రమానికి వెళ్తే... ఎస్పీ తనను చాలా అవమానకరంగా మాట్లాడి... అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. ఎస్పీ నుంచి ప్రాణహాని ఉందని ఇప్పటికే నిఘా విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు ఫోన్లు చేసి తన వివరాలు అడుగుతున్నారని తెలిపారు. ఎస్పీ మాటలను వెనక్కి తీసుకోవాలని సురేష్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి..నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన వంతెన...నిలిచిన రాకపోకలు'