ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోటే... అమరావతి నిర్మాణం జరుగుతుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. తెదేపా, వైకాపాల విధానాలు ఒకే విధంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా... ఓట్లకోసం తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఇప్పటికే సుమారు రూ.7వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయని... అలాంటి అమరావతిని మార్చాలని వైకాపా అనడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దొరకని ఇసుక బెంగళూరులో పుష్కలంగా దొరుకుతుందని పేర్కొన్నారు. వైకాపా నేతలు ఇసుక స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
'ప్రధాని శంకుస్థాపన చేసినచోటే రాజధాని నిర్మాణం' - ప్రస్తుతమున్నచోటే రాజధాని నిర్మాణం
ప్రధాని శంకుస్థాపన చేసినచోటే రాజధాని నిర్మాణం జరిగితీరుతుందని... భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిపై వస్తున్న అవాస్తవ ప్రచారాన్ని పట్టించుకోవద్దన్నారు.

సురేష్ రెడ్డి