భారతీయ ముస్లిం మైనారిటీలకు పౌర సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ చట్టాలతో ఎలాంటి నష్టం లేదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఈనెల 4న కడపలో నిర్వహించే భాజపా ర్యాలీకి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నట్లు వివరించారు. ర్యాలీ ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిచ్చి... ఎన్ఆర్సీకి మాత్రం వ్యతిరేకమని చెప్పడం విడ్డూరంగా ఉందని భాజపా నేత ఆదినారాయణరెడ్డి విమర్శించారు.
సీఏఏకు మద్దతుగా ఈ నెల 4న కడపలో భాజపా ర్యాలీ - kanna laxmi narayana on CAA
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఈనెల 4న కడపలో భాజపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
సీఏఏకు మద్దతుగా ఈ నెల 4న కడపలో భాజపా ర్యాలీ