ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BJP leader 'త్వరలోనే వైకాపా పాలనకు శుభం కార్డు'

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై భాజపా నేత నాగోతు రమేశ్ నాయుడు కడపలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

భాజపా నేత నాగోతు రమేశ్ నాయుడు
భాజపా నేత నాగోతు రమేశ్ నాయుడు

By

Published : Nov 10, 2021, 8:01 PM IST

ప్రతిపక్షంలో ఉన్నపుడు పెట్రో ధరలు పెరిగాయన్న జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని కడపలో భాజపా నేత నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు. పెట్రో ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించకపోవడం సిగ్గు చేటన్నారు. పలు రాష్ట్రాలూ పెట్రో ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. పెట్రో ధరలపై ప్రతిపక్షాలు ఉద్యమాలకు సిద్ధం అవుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి పత్రికా ప్రకటనలతో ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్​పై పన్ను రూపంలో వస్తున్న ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎయిడెడ్ కళాశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడం అమానుష చర్య అని మండిపడ్డారు. విద్యార్థులతో పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని ఆవేదన చెందారు. త్వరలోనే వైకాపా పాలనకు శుభం కార్డు పడుతుందని హెచ్చరించారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details