ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రోడ్లు అధ్వానంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు' - కడపలో భాజపా ధర్నా వార్తలు

అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ కడపలో భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రహదారులు బాగు చేయాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు.

bjp dharna
కడపలో భాజపా ధర్నా

By

Published : Dec 5, 2020, 3:17 PM IST

కడప జిల్లాలో రహదారులు అధ్వానంగా తయారైనా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కడప కలెక్టరేట్ వద్ద భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు.

ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కడప నగరంతో పాటు మారుమూల గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా పాడయ్యాయని ఆదినారాయణరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ రహదారులు పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు త్వరగా వెళ్లేందుకూ సరైన రోడ్లు లేవన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిద్ర నుంచి మేల్కోవాలని... రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకే అపాయింట్​మెంట్ ఇవ్వలేని స్థితిలో సీఎం పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details