ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Two died by falling in Puddle: అదుపు తప్పిన బైక్...నీటి కుంటలో పడి ఇద్దరి మృతి... - Bike accident in Kadapa

Two died by falling in Puddle: ముగ్గురు యువకులు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా...వారి వాహనం అదుపు తప్పి నీటి కుంటలో పడిపోయింది. వారిలో ఇద్దరు మరణించగా...ఒక్కరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన కడప జిల్లా కాశినాయన మండలంలో జరిగింది.

Two died by falling in Puddle
అదుపు తప్పిన బైక్...నీటి కుంటలో పడి ఇద్దరి మృతి...

By

Published : Jan 26, 2022, 9:57 AM IST

Two died by falling in Puddle: కడప జిల్లా కాశినాయన మండలంలో ఘోరం జరిగింది. నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడిన ఇద్దరు యువకులు అసువులు బాశారు. కుటుంబీకులకు తీరని దుఃఖం మిగిల్చారు.

కడప జిల్లా కాశినాయన మండలం ఆకుల నారాయణ పల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్, నారాయణ, కళ్యాణ్ ముగ్గురూ.. ద్విచక్ర వాహనంపై పోరుమామిళ్ల పట్టణానికి వెళ్ళారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా నరసాపురం మోడల్ స్కూల్ వద్ద ఉన్న నీటి కుంటలలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయింది. అదృష్టవశాత్తు కళ్యాణ్ ప్రమాదం నుంచి బయటపడగా శ్రీకాంత్, నారాయణ నీటి ఊబిలో చిక్కుకొని బయటకు రాలేక.. ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఇద్దరు యువకుల మృతదేహాలను అగ్నిమాపక అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బయటకు తీశారు. ఇంటికి ఆధారంగా ఉన్నా ఇద్దరు యువకుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details