కడప అగ్రికల్చర్ టెస్టింగ్ భవనానికి భూమి పూజ - kadapa agriculture testing building latest news
రైతు భరోసా కేంద్రాలు నిర్మించి తామున్నామంటూ రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప శివారులో అగ్రికల్చర్ టెస్టింగ్ భవనానికి ఆయన భూమి పూజ చేశారు.
పట్టణ ప్రాంతాల్లో కంటే... గ్రామీణ ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ... పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కడప శివారులో ఎకరం స్థలంలో అగ్రికల్చర్ టెస్టింగ్ భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి... రైతులకు తామున్నామంటూ భరోసా కల్పించారని చెప్పారు.