STUDENT SUICIDE: కేఎల్‌యూలో బి.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య - crime news
![STUDENT SUICIDE: కేఎల్‌యూలో బి.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య BIHAR STUDENT SUICIDE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13348368-30-13348368-1634150039889.jpg)
20:10 October 13
మృతుడు బిహార్‌కు చెందిన వాడిగా గుర్తింపు
గుంటూరు జిల్లా కేఎల్‌యూలో బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాకు చెందిన సుమిత్ కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిహార్‌కు చెందిన సుమిత్ కుమార్ కేఎల్‌యూ వసతి గృహంలో ఉంటూ.. బీఫార్మసీ చదువుకుంటున్నాడు. వసతి గృహంలోని తోటి సహచరులు పండగ నిమిత్తం ఊరికి వెళ్లి పోవటంతో... గదిలో ఒంటరితనం భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సుమిత్ పక్క గదిలోని విద్యార్థులు భోజనానికి వెళ్లేందుకు పిలవగా.. ఎంతకూ బయటకు రాకపోవటంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే సుమిత్ ప్రాణాలు కొల్పోయాడని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మృతునికి తల్లిదండ్రులు లేకపోవటంతో అతని మేనమామ చదవిస్తున్నారు.
ఇదీ చదవండి