ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి.. లేదంటే వాహనాలు సీజ్​' - కొవిడి తాజా వార్తలు

కొవిడ్​ ఉద్ధృతి పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని..అలా కాకుండా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నో మాస్కుపై అవగాహన కల్పిస్తున్నారు.

awareness on covid
నోమాస్కుపై అవగాహన
author img

By

Published : Apr 10, 2021, 9:58 PM IST

ముఖ్యమంత్రి జగన్​, డీజీపీ గౌతం సవాంగ్​ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నో మాస్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ విజ్ఞప్తి చేశారు. మాస్కులు లేకుండా బయటికి రావొద్దన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు మాస్కులు ధరించని 15 వేల మందిపై కేసులు నమోదు చేశామని.. కరోనా నివారణకు టీకా వేసుకోవడమే సరైన మార్గమన్న ఆయన... 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు.

నోమాస్కుపై అవగాహన

మాస్కు లేకుంటే వాహనాలు సీజ్​..

కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పౌరులు బాధ్యతతో వ్యవహరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశిల్ అన్నారు. ఒంగోలు-మంగమూరు రోడ్డులో మాస్కు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు నో మాస్కుపై కౌన్సిలింగ్ ఇచ్చారు. మాస్కు లేకుండా రోడ్లమీదకి వస్తే వాళ్ల వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు 2700 కేసులు నమోదు చేసి రూ. 2.60 లక్షల జరిమానాలు వసూలు చేశామన్నారు. మాస్కులు ధరించేవాళ్లకు గులాబీలు ఇచ్చి అభినందించారు. లేనివారికి మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి..

మాస్కులు లేకుండా రోడ్డుపైకి వచ్చిన వాళ్లకు మాస్కులు ఇచ్చి కరోనా పట్ల గుంటూరులో పోలీసులు అవగాహన కల్పించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో కరోనా కట్టడి కోసం గుంటూరు డీఐజీ త్రివిక్రమ వర్మ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రయాణికులు, డ్రైవర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్కుల ధరించడం ప్రతిఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలని డీఐజీ కోరారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో మళ్లీ 3 వేలు దాటిన కరోనా కేసులు.. 12 మంది మృతి
వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు

ABOUT THE AUTHOR

...view details