కడప జిల్లా మైదుకూరు సీఐ వేధిస్తున్నాడంటూ.. ఫేస్బుక్లో అక్బర్‌బాషా పోస్ట్ చేసిన వీడియోలో ఆరోపణలు అవాస్తవమని దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అన్వర్ బాషా అన్నారు. గ్రామానికి చెందిన ఖాసీంబీకి సంతానం లేకపోవడంతో తన అన్న కుమార్తె అయిన అప్సానాను పెంచి పెద్ద చేసినట్లు వెల్లడించారు. దీంతో అప్సానా భర్త అక్బర్ బాషా ఖాసీంబీకి చెందిన భూమిని దౌర్జన్యంగా రాయించుకున్నారని ఆరోపించారు.
ANWAR BASHA: 'అక్బర్‌బాషా ఆరోపణలు అవాస్తవం' - kadapa district crime
పోలీసులు వేధిస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్‌బాషా బంధువు, అన్వర్ బాషా అన్నారు. నిబంధనల ప్రకారం అక్బర్‌కు ఆ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
వైరల్ అయిన వీడియో అవాస్తవమని సమావేశం
ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. సివిల్ పంచాయితీ కావడంతో తాము జోక్యం చేసుకోలేమని చెప్పినట్లు వివరించారు. కానీ అక్బర్ బాషా మాత్రం తమకు అన్యాయం జరిగిందని, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారన్నారు. నిబంధనల ప్రకారం అక్బర్‌కు ఆ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.