ప్రొద్దుటూరు మున్సిపల్ స్టాల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు పురపాలక శాఖ నడుం బిగించింది. అక్కడి శివాలయం నుంచి కోనేటి కాల్వ వీధికి వెళ్లే ప్రధాన మార్గం వరకు అక్రమ నిర్మాణాలున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొత్త మార్కెట్ షాపు రూములకు ముందు, వెనుక దుకాణాదారులు అనుమతులు లేకుండా కట్టడంతో పట్టణం నడిబొడ్డున ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఈ విషయమై మున్సిపల్ కౌన్సిల్ లో కొంతకాలంగా చర్చలు జరిగాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. జేసీబీ సహాయంతో అక్రమంగా నిర్మించిన షాపులను తొలగిస్తున్నట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. కొందరు పండ్ల దుకాణాదారులు మాత్రం తమకు ప్రత్యామ్నాయం చూపే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.
అక్రమ కట్టడాలపై అధికారుల ఆగ్రహం! - prodhuturu
అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు.
akrma kattadalu