ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించండి' - కడప అంగన్వాడీ వర్కర్ల తాజా వార్తలు

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం, కడప జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయాల వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు నిరసన చేపట్టారు.

anganwadi workers protest
విజయనగరం కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగిన అంగన్వాడీ వర్కర్లు

By

Published : Oct 1, 2020, 6:59 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ విజయనగరం, కడప జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ధర్నాకు దిగారు. విజయనగరం కలెక్టర్​ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నూతన విద్యా విధానం 2020ని ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, బకాయిలు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

అంగన్వాడీలపై ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ వైఖరి విడనాడాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details