ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్యకేసు: విచారణకు హాజరైన ఆదినారాయణరెడ్డి - కడప జిల్లా వివేకానందరెడ్డి హత్యకేసు వార్తలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. కడప పోలీసు శిక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు.

adinarayana-reddy
adinarayana-reddy

By

Published : Dec 12, 2019, 11:39 AM IST

Updated : Dec 12, 2019, 2:08 PM IST

వివేకా హత్యకేసు: విచారణకు హాజరైన ఆదినారాయణరెడ్డి

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా... భాజపా నేత ఆదినారాయణ రెడ్డి సిట్‌ ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకావాలంటూ... ఆయనకు సిట్‌ నోటీసులిచ్చింది. ఈ మేరకు ఆయన సిట్‌ ఎదుట హాజరయ్యారు.

వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని...ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే..తనను ఉరితీయాలని సిట్ అధికారులకు తేల్చిచెప్పినట్లు....మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు.సుమారు గంటపాటు తనను విచారించారన్న ఆయన...అధికారులు అడిగిన30ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.వివేకాను ఎవరు హత్య చేశారో అందరి మనస్సాక్షికి తెలుసని వ్యాఖ్యానించారు.కావాలనే తనను విచారణకు పిలిచారని వెల్లడించారు.హత్యకేసులో నిజనిజాలు వెల్లడి కావాలంటే...సీబీఐకి అప్పగించాలని కోరినట్లు తెలిపారు.

Last Updated : Dec 12, 2019, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details