ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిట్​నెస్​ లేకుండా పాఠశాల బస్సు నడిపితే అంతే.... - school

నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలల బస్సులను సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మేరకు అధికారులు వేగం పెంచారు. సరైన పత్రాలు లేకుండా రోడ్లెక్కె బస్సులను సీజ్ చేస్తున్నారు.

బస్సులను తనిఖీ చేస్తున్న అధికారులు

By

Published : Jun 14, 2019, 1:17 PM IST

విద్యా సంవత్సరం ప్రారంభమైనందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, భీమరవంలో 16 ప్రైవేట్​ పాఠశాలల బస్సులను అధికారులు సీజ్​ చేశారు. పశ్చిమ గోదవరి జిల్లా వ్యాప్తంగా 1,200 ఫిట్​నెస్​ లేని బస్సులతో విద్యార్థులను తీసుకెళ్తున్నారని సమాచారం.
విశాఖ జిల్లా గాజువాక, కూర్మన్నపాలెంలో పాఠశాల బస్సుల తనిఖీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ, గన్నవరంలో ఆర్టీవో అధికారులు పాఠశాల బస్సులను సోదా చేస్తున్నారు. కడపలో పాఠశాల బస్సులను తనిఖీ చేసి ఎలాంటి పత్రాలు లేని 6 బస్సులు సీజ్‌ చేశారు.

రవాణాశాఖ నిబంధనల ప్రకారం 32 అంశాల్లో ఏ ఒక్కటి లేకపోయినా బస్సులను సీజ్ చేస్తున్నారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించి డ్రైవర్లకు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సామర్థ్య పత్రం ఉన్న బడి బస్సులు మాత్రమే రోడ్డు ఎక్కాలని, పత్రాలు లేని బస్సులు రోడ్డెక్కితే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.

బడి బస్సులపై దాడులు

ABOUT THE AUTHOR

...view details