ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

minor girl raped: వెంటబడిన మానవమృగం కాళ్లు.. కామంతో మూసుకుపోయిన కళ్లు! - కడప జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

పట్టుమని పదేళ్లు నిండని ఆ పసితనానికి తన వెంటే పైశాచికత్వం నడుస్తోందని, తనను బలాత్కారం చేస్తుందని తెలియలేదు పాపం.. మేక పిల్ల కళేబరం పారేసే క్రమంలో తన వెనుక ‘కుతంత్రం’ దాగి ఉందని ఊహించలేదు ఆ చిన్నారి.. నోట్లో గుడ్డలు కుక్కి, ఆపై మానవత్వం మరిచి ఆ చిన్నారిని చిదిమేసింది ఓ మానవ మృగం.. తనపై జరిగింది లైంగిక దాడి అని, ఓ మృగాడు కబళించాడని తెలియక కడుపునొప్పి వస్తోందని రోదించడంతో కన్నవారు వణికిపోయారు.. తమ అమాయకపు బిడ్డపై జరిగిన అకృత్యాన్ని తెలుసుకుని...తమ గారాలపట్టి పడుతున్న వేదనను చూసి గుండెలవిసేలా రోదించారు..

minor girls raped at Kadapa district
కడప జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

By

Published : Aug 12, 2021, 10:02 PM IST

Updated : Aug 13, 2021, 8:50 AM IST

కడప జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

ముక్కుపచ్చలారని ఓ బాలికపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలో నివసించే ఓ దంపతులు చిన్నపాటి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి చెందిన మేక పిల్ల గురువారం చనిపోయింది. కళేబరాన్ని పారవేయడానికి వీరి కుమార్తె (8) ఊరిబయట ఉన్న కంప చెట్ల వైపు వెళ్లింది.

ఆ సమయంలో బాలికను అనుసరించిన ఓ బాలుడు (16) దానిని ఇక్కడ పడేస్తే దుర్వాసన వస్తుందని, ఇంకొంచెం దూరం వెళ్లి పడేయాలని చెప్పి మరింత దూరం తీసుకెళ్లాడు. అక్కడ బాలిక అరవకుండా దుస్తులు ఊడదీసి నోట్లోకి కుక్కాడు. ఆపై అత్యాచారం చేశాడు. బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె అత్త ఘటనాస్థలానికి వెళ్లింది. ఆమెను చూసిన నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. వెంటనే ఆమె తన మేనకోడలిని ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం బాలిక కడుపునొప్పి తాళలేకపోతుండడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఉదంతంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చక్రాయపేట ఎస్‌.ఐ.రఘురామ్‌ తెలిపారు.

Last Updated : Aug 13, 2021, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details