ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Leopard Cub Dead: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి పిల్ల మృతి - ap news

Leopard Cub Dead In Kadapa: కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్​ రోడ్డులో ఇవాళ ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి పిల్ల మృత్యవాతపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుత పులి పిల్ల తీసుకెళ్లి శవపరీక్ష నిర్వహించారు.

Leopard cub
మృతి చెందిన చిరుతపులి

By

Published : Feb 9, 2022, 10:32 AM IST

Leopard Cub Dead In Kadapa: కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఏడాది వయసు కలిగిన చిరుత పులి పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. గువ్వల చెరువు ఘాట్ రోడ్డు మొత్తం అటవీప్రాంతం కావడంతో అక్కడ చిరుతపులులు సంచరిస్తున్నాయి. ఇవాళ తెల్లవారు జామున చిరుత పులిపిల్ల రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత పులిపిల్ల మృతిపై అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కళేబరాన్ని తీసుకెళ్లి శవపరీక్ష నిర్వహించారు. గువ్వలచెరువు పరిసర ప్రాంతాల్లో చిరుతల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details