ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cruel Step Father: కొండ మీద నుంచి ఆ బాలిక పడిపోయిందా..తోసేశాడా..! - కర్నూలు జిల్లాలో గొర్రెల కాపరులు కాపాడిన బాలిక

అతని భార్య చనిపోయింది... ఆమె భర్త నుంచి విడిపోయింది... వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ ఆమె కుమార్తె అతనికి అడ్డుగా అనిపించిందేమో...కొండ మీద నుంచి అంతం చేయడానికి ప్రయత్నించాడా సవతి తండ్రి. అదృష్టవశాత్తు ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ అమానుష ఘటన కడప జిల్లా మిట్టమానుపల్లె సమీప కొండ వద్ద జరిగింది.

Cruel Step Father
బాలికను కొండ మీద నుంచి తోసేసిన కసాయి తండ్రి...

By

Published : Oct 12, 2021, 7:51 PM IST

కడప జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి శివశంకర్‌ ట్రాక్టరు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అతని భార్య కొంత కాలం క్రితం మరణించింది. దీంతో భర్త నుంచి ఎనిమిదేళ్ల కిందట విడిపోయిన షమీనా అనే మహిళను ఎనిమిది నెలల కిందట వివాహం చేసుకున్నాడు. షమీనాది పోరుమామిళ్ల మండలం పులివీడు. అయితే షమీనాకు శివశంకర్​తో పెళ్లికి ముందే.. ఏడేళ్ల కుమార్తె ఉంది. ఆ పాప పులివీడులోని మేనమామ ఇంట్లో ఉంటోంది. దసరా సెలవులు కావడంతో నాలుగు రోజుల కిందట బాలికను శివశంర్‌, షమీనాలు శెట్టివీడుకు తీసుకొచ్చారు. కానీ తండ్రి స్థానంలో ఉన్న ఆ కసాయి కొండపై నుంచి షమీనా కుమార్తెను తోసి చంపే ప్రయత్నం చేశాడు.

బాలికను కొండ మీద నుంచి తోసేసిన కసాయి తండ్రి...

అసలేం జరిగింది...?

మిట్టమానుపల్లె సమీప కొండ వద్ద మంగళవారం ఏడుపులు వినిపించాయి. అటు వెళ్తున్న వారు, గొర్రెల కాపరులు వెళ్లి చూస్తే కొండపై రాళ్ల మధ్య చిక్కుకుపోయిన బాలిక కన్పించింది. ఆమెను రక్షించి వివరాలు అడిగారు. మారు తండ్రి అయిన శివశంకర్ ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి కొండపై నుంచి తోసినట్లుగా బాలిక చెప్పింది. బాలిక చెప్పిన వివరాల మేరకు తల్లికి, వారి బంధువులకు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం బాలికను కడప రిమ్స్​కు తరలించారు.

శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రఫీ తెలిపారు.

ఇదీ చదవండి :

విషాదం: చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details