ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 7 PM

.

ప్రధాన వార్తలు @ 7pm
ప్రధాన వార్తలు @ 7pm

By

Published : Oct 14, 2021, 6:59 PM IST

  • CM REVIEW: కరెంట్​ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలి: సీఎం జగన్
    కరెంటు కోతలు లేకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కరెంటుపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Tulasi Reddy : జగన్ ది 'మందు' చూపు ప్రభుత్వం - తులసి రెడ్డి
    జగన్ ప్రభుత్వానికి 'మందు' చూపు తప్ప.. ముందు చూపు లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్న ఆయన.. కమీషన్ల కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • RAGHURAMA: 'జగన్ పాలనలో రూ.2.87 లక్షల కోట్లు అప్పు'
    వైకాపా పాలనపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో(navarathnalu) ఒకటి రాలిపోయిందని ఎద్దేవా చేశారు. జగనన్నవి కొవ్వొత్తి, అగ్గిపెట్టె పథకాలని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోందని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • DEVARAGATTU : బన్నీ ఉత్సవంపై పోలీసుల మాట అదీ.. స్థానికుల మాట ఇదీ..!
    కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల(Devaragattu Bunny festival)కు ఎంత ప్రాధాన్యత తెలిసిందే. దసరా రోజున కొనసాగే కర్రల సమరాన్ని వీక్షించేందుకు భారీగా జనాలు తరలివస్తారు. అయితే.. ఈసారి ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై స్థానికులు ఏమంటున్నారంటే... పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Aryan Khan bail: ఆర్యన్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వు.. 20 వరకు జైల్లోనే..
    ఆర్యన్‌ ఖాన్‌కు (Aryan Khan Bail) మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్​పై తీర్పును రిజర్వ్​ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్యన్​ 20వ తేదీ వరకు జైల్లోనే ఉండాల్సి ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • క్లాసులకు రావడం లేదని.. విద్యార్థిపై టీచర్​ పైశాచికం
    క్లాసులకు సరిగా రావడం లేదని విద్యార్థిని కింద పడేసి, జుట్టు పట్టుకుని తీవ్రంగా కొట్టాడు ఓ టీచర్​. ఈ ఘటన తమిళనాడు చిదంబరంలో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బంగ్లాదేశ్​లో ఆలయాలపై దాడులు- అల్లర్లలో ముగ్గురు మృతి
    హిందూ దేవాలయాలపై (Bangladesh Temple Attack) దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్​లో పెద్ద ఎత్తున అలర్లు చెలరేగాయి. దీంతో 22 జిల్లాల్లో సరిహద్దు దళాలు, పారా మిలటరీ బలగాలను మోహరించింది ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Stock Market today: లాభాల జోరు.. 61వేల మార్కును దాటిన సెన్సెక్స్
    స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) 569 పాయింట్లు పెరిగి 61,300 వేల పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 176 పాయింట్ల లాభంతో 18,339 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీలు రెండూ జీవనకాల గరిష్ఠాలను తాకాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • IPL 2021 Final: అసలైనపోరులో ట్రోఫీ నెగ్గేదెవరు?
    ఐపీఎల్‌-14వ సీజన్(IPL 2021 Final) ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌(CSK Vs KKR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశల్లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరిన ఇరుజట్లు.. కీలక మ్యాచ్​కు సిద్ధమయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Mahesh babu new movie: రాజమౌళితో సినిమాపై మహేశ్​ క్లారిటీ
    స్టార్ దర్శకుడు రాజమౌళితో సినిమాపై మహేశ్​(mahesh babu new movie) స్పష్టతనిచ్చారు. అన్ని భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుందని, దీనితోనే బాలీవుడ్​లోకి అరంగేట్రం చేయనున్నానని అన్నారు. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ఈ సినిమా మొదలుకావొచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details