ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడప జైలులో కరోనా పంజా..303 మంది ఖైదీలకు పాజిటివ్​ - kadapa central jail latest news

కడప కేంద్ర కారాగారంలో సోమవారం, మంగళవారం జరిపిన పరీక్షల్లో ఏకంగా 303 మంది ఖైదీలకు, 14 మంది సిబ్బందికి సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మిగిలిన ఖైదీలు ఆందోళన చెందుతున్నారు.

303 prisoners tested corona positive in kadapa central jail
303 మంది ఖైదీలకు సోకిన కరోనా మహమ్మారి

By

Published : Aug 18, 2020, 10:36 PM IST

Updated : Aug 19, 2020, 3:27 AM IST

కడప కేంద్ర కారాగారంలో కరోనా విజృంభిస్తోంది. జైలులోని 700 మంది ఖైదీలకు సోమవారం, మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా... 303 మంది ఖైదీలకు, 14 మంది సిబ్బందికి పాజిటివ్​గా​ నిర్ధారణ అయ్యింది. ఒకేసారి అంత మందికి కరోనా సోకడం వల్ల అధికారులు, మిగిలిన ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. అధికారులు అప్రమత్తమయ్యారు. జైల్లో ద్రావకాన్ని పిచికారీ చేశారు.

కడప జైలులో కరోనా పంజా..

కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయినవారిలో మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్​రెడ్డి ఉన్నారు.

Last Updated : Aug 19, 2020, 3:27 AM IST

ABOUT THE AUTHOR

...view details