అమరావతి ప్రాంతంలో తనని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వక దాడులు చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. నిన్న అమరావతి రథోత్సవానికి వెళ్తుండగా... తన కాన్వాయ్‌లోని వాహనం ఓ రైతును ఢీ కొట్టిన ఘటనపై మాట్లాడిన ఆయన... ఆ రైతుకు పెద్దగా గాయాలేమీ అవలేదని... వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయించానన్నారు. అయితే రథోత్సవానికి తిరిగొస్తుండగా తనపై, తన అనుచరులపై కారం చల్లుతూ, కర్రలతో కార్లపై కొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఐకాసా ముసుగులో ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారు: ఎంపీ సురేష్ - ysrcp mp nandigam suresh news updates
రైతును తన కాన్వాయ్ వాహనం ఢీ కొట్టటంపై గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ స్పందించారు. రైతుకు పెద్దగా గాయాలేమీ అవలేదని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో జేఏసీ ముసుగులో తనపై ఉద్దేశపూర్వక దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ysrcp mp nandigam suresh pc