పరిపాలనపరంగా ఎదురవుతున్న ఒడిదొడుకులను అధిగమించేందుకు కొన్ని సందర్భాలలో అప్పులు చేయడం తప్పదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు(mp mopidevi venkata ramana on ap financial crisis) అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా గుంటూరులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే.. అప్పులు చేయక తప్పదన్నారు. గతంలో ఎవరూ అప్పులు చేయనట్లు కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో తెదేపా, కాంగ్రెస్ పాలనలో కూడా అప్పులు చేశారని ఎంపీ మోపిదేవి((mp mopidevi slams opposition parties)గుర్తు చేశారు. పరిస్థితిని బట్టి అప్పులు తీసుకోవడం సరైన నిర్ణయమే అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పులు ఊబిలో ఉందని... తప్పనిసరి పరిస్థితిలో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని ప్రస్తావన చేయడం క్షమించరానిదంటూ ఘాటుగా బదులిచ్చారు.