రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాలని వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. అయ్యన్నపై గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీకి వైకాపా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.
కోడెల వర్ధంతి సభలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయని అన్నారు. హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలు దళితులను కించపరిచటమేనని వారు అభిప్రాయపడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొట్టేలా తెదేపా నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.