మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఎమ్మెల్యే సంజయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో.. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. చీరాలలో వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ చేపట్టిన ర్యాలీలో... మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు.
మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణుల ర్యాలీ - ysrcp Activists have held rallies throughout the state to support the decision of the three capitals.
మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమంటూ నినాదాలు చేశారు.

గుంటూరులో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, మహమ్మద్ ముస్తఫాల నేతృత్వంలో కాగడాలలో ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో వైకాపా కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. వికేంద్రీకరణను సమర్థిస్తూ కడప జిల్లా మైదుకూరు, రైల్వేకోడూరులో ర్యాలీలు నిర్వహించారు. కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. బనగానపల్లెలో కొవ్వొత్తుల ర్యాలీతో మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ మన్యం పాడేరులో ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చదవండి...రాష్ట్రపతి దృష్టికి అమరావతి రైతుల ఆవేదన