ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

21 నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన - Ys sharmila new party news

ఈనెల 21న తెలంగాణలోని ఖమ్మంలో పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. జిల్లాలోని వైఎస్సార్​ అభిమానులతో ఆమె సమావేశం కానున్నారు. షర్మిల పార్టీ ఏర్పాట్లతో తమకు సంబంధం లేదని వైకాపా ఇప్పటికే ప్రకటించింది.

ys-sharmila-will-tour-khammam-on-the-21st-of-this-month
21 నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

By

Published : Feb 11, 2021, 10:54 PM IST

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన షర్మిల... ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆమె... తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై మంతనాలు జరిపారు. జిల్లాల్లోనూ పర్యటిస్తానని ఇదివరకే షర్మిల ప్రకటించారు.

అందులో భాగంగా ఈనెల 21న ఖమ్మంలో పర్యటించనున్నారు. జిల్లాలోని వైఎస్సార్​ అభిమానులతో షర్మిల సమావేశం కానున్నారు. షర్మిల పార్టీ ఏర్పాట్లతో తమకు సంబంధం లేదని వైకాపా ఇప్పటికే ప్రకటించింది. ఆమెది పూర్తిగా సొంత నిర్ణయమని తెలంగాణతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని.. అందువల్ల వైకాపా శాఖ అక్కడ ఏర్పాటు చేయబోమని ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details