చరవాణి కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో శనివారం జరిగింది. గుంటూరు లాలపేట ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన మల్లెల జోసఫ్ కుమార్ (18) ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతని చిన్న వయసులో తండ్రి మరణించాడు. అప్పటి నుంచి గుంటూరు ఏటుకూరు రోడ్డులోని తన బాబాయి కోటేశ్వరరావు వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. కోటేశ్వరరావు చరవాణిని జోసఫ్‌కుమార్ తీసుకుని రోజూ గంటల తరబడి గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో యువకుడిని అతని బాబాయి మందలించి సెల్ఫోన్ తీసేసుకున్నాడు.
చరవాణి కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య - గుంటూరు ఆత్మహత్య వార్తలు
కుటుంబసభ్యులు సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాద ఘటన గుంటూరులో జరిగింది. చదవయ్యాక కొనిస్తామని అతని బాబాయి చెప్పినా వినకుండా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
suicide
తనకు కొత్త చరవాణి కావాలని జోసెఫ్ అడగగా... ఇంటర్ పూర్తయ్యాక కొనిస్తానని కోటేశ్వరరావు చెప్పాడు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన జోసఫ్ కుమార్... శనివారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై బాలకృష్ణ వెల్లడించారు.
ఇదీ చదవండి
ఇల్లెక్కిన స్కార్పియో.. మహీంద్రా ఫిదా