ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగే యోచనలో వైకాపా!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార వైకాపా పావులు కదుపుతోంది. గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సొంతంగానే అభ్యర్థులను బరిలో దింపేందుకు సమాయత్తమవుతోంది.ఇప్పటికే అభ్యర్థుల విషయమై పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.

mlc elections in ap
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

By

Published : Feb 12, 2021, 9:41 AM IST

గుంటూరు - కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సొంతంగానే అభ్యర్థులను బరిలో దింపేందుకు వైకాపా సమాయత్తమవుతోంది. ఇతర ఉపాధ్యాయ సంఘాల తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతునివ్వడం కంటే సొంతంగానే అభ్యర్థులను బరిలోకి దించాలన్న ప్రాథమిక నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే అభ్యర్థుల విషయమై పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.

గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రచారంలోకి దిగిన కల్పలతా రెడ్డి వైకాపా మద్దతును కోరుతున్నారు. ఆమె విద్యాశాఖ జేడీ ప్రతాప్‌రెడ్డి భార్య. వైకాపా అభ్యర్థిగా అధికారికంగా బరిలో నిలిచే ప్రయత్నాలను ఆమె చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తెనాలిలో విద్యా సంస్థలున్న రామారావు కూడా వైకాపా మద్దతును కోరుతున్నట్లు సమాచారం. రామారావు మంత్రి అవంతి శ్రీనివాస్‌కు బంధువని చెబుతున్నారు.

శాసనమండలిలో సంఖ్యాబలం పెరిగేందుకు వీలుగా సొంత అభ్యర్థులనే బరిలోకి దింపాలని అనుకుంటున్న వైకాపా వీరిద్దరిలో ఒకరికి మద్దతునిస్తుందా? పార్టీ తరఫున వేరేవారిని పోటీకి నిలుపుతుందా అనేది తేలాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:

'రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details